Pages

Monday, February 9, 2009

మూగబోయిన వేణువులోకి గాలివై ప్రవేశించావు
ప్రతి రంధ్రం నుంచి రాగాలని పలికించావు
నీవిచ్చిన స్పూర్తిని మరవలేను
నీవందించిన ఖడ్గాన్ని విడువబోను
కారు చీకట్లు నిండిన నా మదిలో
రవి కిరణాలు నింపావు
వదులుకున్న బానిసత్వం తిరిగి పొందబోను
స్వరాజ్యం అను వసంతాన్ని జీవితంలో మరువలేను

Sunday, February 8, 2009

ఒక అనుభూతి

జీవితపు ప్రయాణంలో ఎన్నో మలుపులు
మలుపు మలుపులో ఇంకెన్నో కొత్త పరిచయాలు
ప్రతి పరిచ్యమ్లోను కొత్త కొత్త అనుబుతులు అనుబవాలు
పరిచయం దూరమయ్యే వేళ మాత్రం
అనంతమైన ఆవేదన
మరో కొత్త పరిచయం దొరికే వరకు తీరని క్షోభ
అయినాకాని అలుపెరుగని చక్ర భ్రమణం ఆగిపోవున?
చెంచేలమైన మనసునీ సమాధానపరచడం సాధ్యపడున?

Saturday, February 7, 2009

ప్రేమికుల రోజు కానుకలు

గూడు విడిచిన గువ్వ కూడా సందె వేళకు గూడు చేరుతుందే,
నిన్ను చూచిన నా హృదయం మాత్రం తిరిగి రాలేదు.
బోయ విడిచిన బాణానికి సైతం లక్ష్యం ఒకటి ఉంటుంది,
నిన్ను తలచి శున్యంలోకి చూచే నా కంటి పాపకి ఎం కనిపిస్తుంది నీ రూపం తప్ప.
మబ్బు చాటున దాగిన కూడా జాబిలమ్మ వెన్నెల కాంతిని కోల్పోవున
మనసు మాటున దాచి ఉంచిన ప్రేమ మాధుర్యం తరగిపోవున.
కరుణకు నోచుకోని పుష్పం విలపించగా,
కరుణ లేని దేవత కొనగంటి చూపు వరమైన ఇవ్వలేదే.
అలల రూపంలో సంద్రం తన బాధను వేలిబుచ్చగా,
అందలాన జాబిలి రవ్వంతైన తోనకలేదే.
కరగని బండ రాతి శిలలు కదా పడతుల హృదయాలు,
అలుపెరుగని ప్రేమికులు కదా యువకులు.

ప్రేమికుల రోజు కానుకలు

కడలి అంచున ఎగసి పడే కెరటం,
సిగ్గుతో తల వంచుకు వెళ్లిపోతుంటే ఎందుకో అనుకున్నాను,
మువ్వలు తొడిగిన నీ పాదం చూచెను కాబోలు.
పున్నమి వెన్నెల జ్యోత్స్న మెల్లగా మబ్బుల చాటు చేరెను,
నీ కను బొమ్మల మధ్య కుంకుమ రేఖను గంచేనేమో.
సెలయేళ్ళు గల గల రాగాలు మాని ముగబొయెను,
నీ పలుకుల సప్త స్వరాలు వినినంతనే.
ప్రకృతినీ సైతం స్థంబింపచేస్తుంది నీ అందం,
అందానికి దసోహమవ్వడం పురుష స్వభావం.