Pages

Tuesday, May 26, 2009

అమ్మని మించిన దైవం లేదు
అమ్మని మించిన శక్తీ లేదు
అమ్మ
ని మించిన ఆశ లేదు, అదృష్టం లేదు
అమ్మ
ని మించిన నమ్మకం లేదు
అమ్మని మించిన ఆస్తి లేదు
అమ్మ ఆశిస్సులు మించిన ధైర్యం లేదు


అమ్మే కదా తొలి గురువు
ఏ అమ్మకు కాదు తన బిడ్డ బరువు
అమ్మ తోడుంటే చాలు లోకాన్ని ఎదిరిస్తా
అమ్మ లేకుంటే ఒంటరినై రోదిస్తా 
   
    
                                        


                                           ------- Srinivas

The following one is about a Father & Daughter relation

గారాబం చేసిన గాంభీర్యం చూపినా,

గారాల తల్లి అలిగిన వేళ

గాడాంధకారం అలముకోదా?

పుణ్యల తల్లి, మా కల్పవల్లి,

కోరిన కోర్కెను తీర్చకపొతే

బుంగమూతి అందం చూడనివడిదా బాగ్యం?

హాయిని కొల్పే ఆ దరహాసం

క్రిష్ణ పక్షమెరుగని జాబిలి కదా?

చిట్టి తల్లి చెతులు నా చిటికెన వెలు పట్టి

పుతడి పాదాలు బుడి బుడి అడుగులు వేయగ

కందిపొవున? కమిలిపొవున? అనే దిగులు,

చేతులలొ ఒదిగిపొయె పసిపిల్ల

భూజాలకెదిగిన వేళ,

విదిచి వెళ్ళిపోతుందేమొ అనే భయం.

గుండెల పై సేదతీరె పుత్తడి బొమ్మ

వేరే గుటికి చేరిన వేళ....

కన్నిటికి అడ్డుందా?

గుండెకోతకి హాద్దుందా?

ఈ సత్యం మారదని తెలిసిన, ఆవేదనకు అంతుందా?

 


                                                                           --------- Srinivas

 

ఏమిటా కూని రాగాలు?

తీతువు కూతలు..


ఏవేవో పిచ్చి అరుపులు?

అనాధల ఆకలి కేకలు..


ఏమిటా ఆర్తనాదాలు?

విధివంచితుల ఏడుపులు..


ఏవో వింత ధ్వనులు?

వేగం పుంజుకున్న పేదవాడి గుండెచప్పుడు..


ఏమిటి వేడిమి?

యువకుల మండే నెత్తురు..


ఏమిటీ ఎరుపు?

ఉదయించే సూర్యుని కిరణం..


చిగురించిన విప్లవ శాఖం

అంకురించిన జన చైతన్యం..


ఏమిటీ చీకటి?

అస్తమించబోయే అధికార మదం...

 

                                                       ------ Srinivas

Wednesday, May 6, 2009

నేను నడిచిన దారుల్లో

చుశానేన్నో పలకరింపులు

పొందనేన్నో చిదరింపులు

నేను నడిచిన దారుల్లో

పొందనేన్నో ఆకర్షణలు

తెలుసుకున్ననేన్నో సత్యాలు

నేను నడిచిన దారుల్లో

ఎదుర్కున్ననేన్నో స్వార్థాలు

నేర్చుకున్ననేన్నో జీవిత పాఠాలు

నా జీవితయనంలో

కలుసుకున్నాను కొంతమందిని

చేజార్చుకున్నాను ఎంతోమందిని

నా జీవిత సింహావలోకనంలో

ఎన్నో ఎన్నెన్నో

నేర్చుకున్నాను, తెలుసుకున్నాను

గెలుచుకున్నాను, విడుచుకున్నాను

ఎత్తుకి ఎదిగాను, పాతాళానికి ఒరిగాను..

ప్రతి ఘటన హృదయానికి హత్తుకునే సంఘటనే

Friday, May 1, 2009

ఇది విలయం మహా ప్రళయం
జన సముద్రం
జల సముద్రం
పోటేత్తితే కాయదు లోకం

ఆకలి చావులు, ఆనాధ కేకలు
మిన్నంటాయి;
ఆకలితో మా కడుపులు వెన్నంటాయి.
ప్రకృతి చేసే విలయతాండవంలో
మా కన్నులు చెమర్చాయి,
మా బంధాలు కరువయ్యాయి,
మా ఆశలు అడుగంటాయి.

మా కన్నులు ఎర్రబారాయి,
మా రక్తం ఉడుకులేత్తింది,
మాలోని శివతత్వం మేల్కొంది,
మా శక్తిని మాకు తెలియచేసింది.
ఇకసాగావు ధనవంతుల కేలివిలసాలు
ఇక సాగవు సంపన్నుల వికటత్తహసాలు
ఉద్యమం ఒక ఆరంభం
ఇంతటితో మా ఆకలి చావులకు పాడుతాం అంతిమ గీతం...
మనం హీనులం పీనుగులం
ఇదేనా మన జీవితం
నిత్యం నిరాశ నిస్సత్తువులతో
నిట్టుర్పుల సుడిగాలిలో
నిస్ప్రుహనే నివాసంగా మార్చుకున్నాం
ఎప్పటికీ విముక్తి మురికి గుండం నుండి
భుక్తి నుండి ముక్తి ఎప్పుడు మనకి
నెత్తురునే మంటగా మార్చుకున్న సైనికులు కావాలి నాకు,
నరాలు కత్తులుగా ఉన్న యువకులు రావాలి ముందుకు
వైరాగ్యం వలదు వీరత్వం కావాలి
ఆకర్షణ ఒద్దు అంకిత భావం కావాలి
శివుని జటాజుటి నుండి విరుచుకుపడ్డ వీరభద్రుడే ఆదర్శం మనకు
నా భారత యువతా! మీలో రుద్రముర్తుని మేల్కొల్పుడు
సాగిపో నీ సాహసోపేత బాటలో ముందుకు