Pages

Saturday, July 16, 2011

కన్నీరే ఎద ఇరుకున జలపాతంగా..
ఎద శ్వాసే పిల్ల గాలై
మది మబ్బులను తాకగా..
ఆలోచనల చిరుజల్లులు కురిసి
కనుల వెంట కమ్మని తడిగా
ఉరకలు వేయగా..
తిరిగి తిరిగి ఆ కన్నీరు
మళ్ళి ఎద ఇరుకున జలపాతాన్ని చేరగా..
చక్రభ్రమణం ఆగున?!..
తలపుల గమనం కొనసాగగా..