Pages

Friday, September 30, 2011

రాస్తున్న.. రాస్తున్న..
రాతిని కలముగా మలచి..
రాతను.. గీతను.. మార్చగా.. 
రాస్తున్న.. రాస్తున్న.. 

క్షీణించి.. హీనించి..
బ్రతకలేక.. సగం చచ్చి..
పడి ఉన్న మనసును తట్టి లేపగా..
రాస్తున్న.. రాస్తున్న.. 

రాస్తున్న ఇదే..
ముందెప్పుడూ చరిత్ర చూడని భవిష్యవాణి..
నిటాలాక్షుని వ్యాకరణాన్ని..
అనంతమైన కవిత్వాన్ని..
నా అంతరంగాన్ని.. 

Saturday, July 16, 2011

కన్నీరే ఎద ఇరుకున జలపాతంగా..
ఎద శ్వాసే పిల్ల గాలై
మది మబ్బులను తాకగా..
ఆలోచనల చిరుజల్లులు కురిసి
కనుల వెంట కమ్మని తడిగా
ఉరకలు వేయగా..
తిరిగి తిరిగి ఆ కన్నీరు
మళ్ళి ఎద ఇరుకున జలపాతాన్ని చేరగా..
చక్రభ్రమణం ఆగున?!..
తలపుల గమనం కొనసాగగా..

Sunday, March 13, 2011

Ee Rathiri vela..

సమయం తన పంజా విసిరి
స్వర్గాలను కాజేస్తుంటే..
శున్యంలోకి తొంగి చూస్తూ
దేనికోసం నీ ఎదురు చూపులు ??

ఏ కెరటం కూడా
శాశ్వతం కాదని
సంద్రం చెప్తున్నా కూడా
ఏముందని అన్వేషిస్తున్నావ్
ఆ కడలిని చూస్తూ....

సమయాన్ని పిడికిలిలో బంధించే..
సంద్రాన్ని సంకల్పంతో జయించే..
ఆత్మస్థైర్యం నీ గుండెల్లోనే దాగుందని
మరచి.. దిక్కులలో.. చుక్కల్లో..
ఎం వెతుకుతున్నావ్.. ??

Nenu Prakruthini

నీ ఉనికికి.. నీ ప్రగతికి..
నీ జగతికి.. ఈ ధాత్రికి..
మూలాధారం నేను..
ప్రతి జీవికి.. తన మనుగడకి..
సాక్షి భూతం నేను..
నాకు లేవు ఏ అసమానతలు..
నియంత్రిస్తా హెచ్చు తగ్గులు..

ఒక్కడివే.. నువ్వొక్కడివే..
నీ స్వార్థం కోసం.
నా సృష్టిని అతలాకుతలం చేస్తూ ఉంటె..
చూస్తూ నేనెలా ఊరికే ఉంటా..
నువ్వనుకునే నీ అభివృద్ధి..
నీ పాలిట బస్మాసుర హస్తం..
నీ తోటి జీవ జాలానికి మృత్యు పాశం..

నా కోపం
మహోగ్ర రూపం..
నా ఆగ్రహం..మహా ప్రళయం..
నువ్వు విషం కక్కితే..
నేను విలయ తాండవం చేస్తా..
నువ్వు పచ్చదనం పెంచితే..
నేను చిరు నవ్వు చిందిస్తా...

Friday, March 11, 2011

అలజడి రేగిన అలల తాకిడి
అలుపెరుగని జీవన వ్యవస్థని అతలాకుతలం చెయ్యగా
ఎక్కడ నువ్వున్నవో..
ఎక్కడ నేనున్నానో..
దిక్కు తెలియని స్థితిలో
కలలు కని కట్టించుకున్న
కలల సౌధం కుప్ప కూలిన వేళలో
కంట నీరు తప్ప
గత్యంతరం ఏముంది..
నిందిన్చెంత కోపం లోపల ఉన్న..
నిందిన్చావలసింది ఎవరిని ??

Saturday, March 5, 2011

Now, here, it is the time,
to go back to the natives.
All of us, For U & Me,
it is definite to go
but the core of my heart
is full of pain.
I never feared abt my end,
but the rest of wisdom,
which is not yet gained
is just tantalizing my heart....

I saw, Many of my companions
died, wounded and going to die
but never my heart melted.
I saw, many kingdoms
just faded in my hands.
Day by day, the verge of life
came nearer to me.
And now the wisdom
is just a mirage for me.
Which might be a curse of the defeated kings......

Let the black day of my life come
closer to me, My eyes will be
still open in the quest of wisdom.
My fist will be open
for the unknown ocean.
Oh! The sun is just losing its shine.
He, The Almighty is near to me.
In the next very second my sword
is going to rust.
సాగర తీరంలో
వెన్నెల నీడల్లో
గోదావరి ఒడ్డున ఇసుక తెన్నెల్లో
ప్రకృతి ప్రతి ముద్రలో
వెతిక నీ జాడ కోసం..
తిరిగా నీ ఉనికి కోసం..

నీ నవ్వులు వినపడగానే
కెరటాల సవ్వడి నిశబ్దం వహించింది
నీ రూపం కనపడగానే
వెన్నెల మబ్బు చాటు చేరింది..
నీ అడుగులు తాకగానే
గోదావరి ఉరకలు వేసింది..

నీ స్నేహం కోసం
నీతో సాన్నిహిత్యం కోసం
ఆరాట పడింది నా హృదయం..