Pages

Monday, February 11, 2013

కమ్మని కన్నీరు కార్చుతాను 
కవులకై.. కవుల భావాలకై..
కమ్మని కన్నీరు కార్చుతాను 
కవితకై .. కవితా అనురక్తికై..
కష్టాలు.. ఇష్టాలు.. కలబోసి 
క్రౌర్యాలు.. సౌర్యాలు.. వడబోసి 
నాటి నుంచి నేటికొక 
పెద్ద నిచ్చెనేసి..
మంచికి.. చెడుకి.. మధ్య 
సన్నని గీత గీసి..
వివరించే.. మురిపించే..
జీవిత సారాన్ని నేర్పించే..
కవితకై కమ్మని కన్నీరు అర్పిస్తాను..
కలలు కనలేని కనులుండి 
ఏం లాభం అన్నాడు ఒక కవి 
కలలకు కొలతలు, హద్దులు 
లేవన్నాడు వేరొక కవి..
కలతలే నెలవైన మదిలో 
కలలకు చోటెక్కడ??
కనులు కునికే నిసిధిలో సైతం 
కలవరింతలే జోల పాడితే 
ఏ కలలో కనలి నా కలను ??

Sunday, October 7, 2012

మాటంటే ఒక పలకరింపు
దుఖంలో ఒక ఓదార్పు

సహాయంలో ధైర్యం
మాటంటే ఒక వరం

శాంతంలో వెన్నెల
కోపంలో అగ్నికిల 
నరం లేని నాలుక చివర 
వేలాడే కత్తులుర..
ఆదమరచి మాట అంటే
ప్రాణాలనే చల్లర్చురా..
గుర్తెరిగి మసలుకో..
మర్మమెరిగి పలుకుని సవరించుకో..

Monday, July 23, 2012

ముసుగు 

ఒంటరిగా లోలోన  నేను క్రుంగిపోతున్నా..
బాహాటంగా బయట నేనే నృత్యం చేస్తున్నా..
దుఖంతో నాలో నేనే ఏడుస్తూ ఉన్నా..
మొహమాటంగా పెదాలపై నవ్వులు పూయిస్తున్నా
నేను కాని నన్ను.. నేను ప్రదర్సిస్తున్నా..
అంతులేని అంతర్మధనం అనుభవిస్తున్నా..
జననమందు నీ ఉనికి తెలియలన్నా..
మరణమందు నీ విలువ తెలుపలన్నా..
ఆనందం వెల్లువిరిసిన..
దుఖం పొంగిపొరలిన..
ఆకలితోనైన... అవేధననైన..
నవ నాడులు కృంగిన వేళ
అలసిన మది విశ్రాంతి కోరు వేళ 
ప్రతి హృదయం స్పందించే తీరు
ప్రతి నయనం కార్చే కన్నీరు...

Thursday, October 27, 2011

లోకానికి ఒకటి చూపి
మాలోన మరొకటి దాచే
ముసుగులు మావి ఓహ్ శంకర!!

నీలోన విషాన్ని దాచి..
లోకానికి అమృతమిచ్చిన
వైణం నీదిరా భోళ శంకర!!

లౌక్యం తెలియనివాడ..
లింగాకరా.. అమాయకేశ్వరా..
శంకర.. హర హర..
రారా శంకర
దిగి రారా ఈశ్వర
దిక్కులన్ని ఒక్కటి చేయగా
దీనుల మొరలాలకించగా
ధ్యానం భగ్నం కావించి
ఇల చేరరా పరమేశ్వర..

మనుషులను ఒదిలి
మరలతో సావాసం చేసి
మమకారానికి ముసుగులు తొడిగి..
జీవిస్తున్నాం అనే బ్రాంతిలోనే బ్రతికేస్తున్నాం..
లోకంలో ఉంటూ ఒకరితో ఒకరికి
ఎవరికీ ఎవరో తెలియని మాకన్నా
కాష్టంలో ఉన్నా.. లోకమంతా నడిపించే
నువ్వేలే మిన్న..

కళ్ళు మూసి ధ్యానించే దేవర
కన్నులు మూయించే లయ కార
మా కన్నులు తెరిపించవయ్య ఓంకార