
ఉనికిని కోల్పోయిన వేళ
నరకానికి నా పయనం
అనుబంధాలు అసత్యాలు అయిన వేళ
నరకానికి నా పయనం
అంతు లేని దుఃఖం అలముకున్న వేళ
ఆత్మీయత అస్తిత్వం కోల్పోయిన వేళ
సాగించాను నరకానికి నా పయనం..
అనంతమైన దుఖం మహోగ్రమైన వైతరనిగా ప్రవహించగా
అలమకున్న చీకటిలో, యమ లోకపు వాకిటిలో..
విషమించిన పరిస్థితులే కింకరులై లాక్కుపోగా
మతి లేక.. మాట రాక.. ఎదిరించే శక్తి చాలక..
మౌనంగా సాగించా నరకానికి నా పయనం..
పెంచుకున్న ప్రేమ.. పంచుకున్న స్నేహం..
అల్లుకున్న అనుబంధం.. పాపంగా మారి..
నా పాలిట శాపంగా చేరి..
పాశాన్ని వేసి ప్రాణాలను హరించగా..
రోదిస్తూ సాగించా.. నరకానికి నా పయనం..