Pages

Tuesday, November 24, 2009
నువ్వు నా చెంతకి నడిచోచ్చిన వేళ..
నువ్వు
నాతో ఉంటానని మాటిచ్చిన వేళ..
నా
దురదృష్టానికి ఇంకా కాలం చెల్లిందని అనుకున్న..
ఆకాశాన్ని
తకేటట్టు నాలో నేనే గళం ఎత్తి కేక పెట్ట..
అవధులు
లేని ఆనందంతో అలల తరంగంలాగా ఉరకలు వేశా..

అంతలోనే
విధికి కన్ను కుట్టిందో..
శనికి దురద పుట్టిందో..
ఏమిటిరా
అని చూస్తే..
నన్ను
విడిచి వెళ్ళిపోయింది అనుకున్న దురదృష్టం
నిజానికి
నన్ను విడిచి వెళ్ళిపోలేదు..
నాకన్నా
వేగంగా అది
నాకన్నా
ముందరే అది
నేను
చేరుకోవలనుకున్న ఆనందం చెంతకి చేరింది..
చేరి
.. ఆనందాన్ని నేను అశ్వదించలేకుండా చేసింది..
స్వర్గాన్ని
సైతం నా కళ్ళకు నరకంలాగా కనపడే విధంగా చేసింది..
భానుడి తొలి కాంతిలో
పసివాడి తొలి అడుగులో
పంట చేలు తొలి మొలకలో
ప్రేయసి ఇచే తొలి ముద్దులో
మది కవ్వించే అందం..వర్ణనాతీతమైన ఆనందం..

కర్షక జీవి తొలి వేతనం
ఆకలితో ఉన్న వాడికి పిడికెడు అన్నం
కన్నీరు కార్చే ఒంటరికి వెచ్చటి స్పర్స
సైనికుడికి వీర మరణం
మూల్యం కట్టలేని వరం..
అమూల్యమైన ఆనందం..
కాల రుద్రుడే కేక పెట్టేనా..??
కాల చక్రం గతి తప్పేనా ???

కల్పాంతపు ముహుర్థమో....?
కాలుష్యపు విశ్వరుపమో?
విష జ్వరాలు విష నాగులై..
బుసలు కొట్టగా..
సామాన్యుడి బతుకు కాలి బుగ్గి పాలైంది..
ప్రమాదమే పరమావధిగా
సాంకేతిక సాగుతుండగా..
సామాన్యుని జీవిత చిత్రం చిధ్రమైనది...

మృత్యు దేవత మహాయాగం తలపెట్టేనో?
కలిపురుషుడు అభయమిచ్చి వరమోసగెనో?
అంతు చిక్కని వ్యాదులెన్నో అవతారం దాల్చెను...
మానవాళికి దుఖాన్ని..ప్రకృతికి గుండెకోతని.. మిగిల్చేను..

అవరోధాలు తేచిపెట్టు ప్రయోగాలు కట్టిపెట్టి..
పచ్చదనంతో పర్యావరణ రక్షణకై నడుం కడితే..
కాలరుద్రుడే నీలకంటుడై అభాయమోసగును...
పుడమి తల్లి పులకించి పాడిపంటలు ప్రసాదించును ..
ఇదేమి గతి
అధోగతి
పురోగతి అయ్యింది ప్రశ్నార్ధకం..
ఇదేనా కలలు కన్నా సామ్రాజ్యం..

addiction ల బాటలో attraction ల ఉభిలో
మునుగుతుంది యువత
నవ భారత నిర్మాత...

ఏనాడో ఎప్పుడో సాధించినా ఘనత తలచి
ఈనాడు మన కర్తవ్యం అధమరచి
గతం తలచి... నెల విడిచి సాము చెయ్యడం పారిపట
గ్రహపటా..?

ప్రేమ విఫలమై ఒకడు... ప్రేయసిని చంపి ఇంకొకడు..
హత్యలు.. ఆత్మ హత్యలు..
ఇదేనా పురోగతి.. ఇదేనా నా జగతి..
చదువు లేక ఒకడు.. చదివి బ్రతుకు తెరువు లేక ఒకడు...
terrorist లు naxalite లు ఉధయిస్తున్నారు..
ఉద్యమాల మంచి పేరు చేదగోడుతున్నారు ..
ఇదేనా పురోగతి.. ఇదేనా నా జగతి..

యువత అంటే శక్తి
యువత అంటే యుక్తి
యువత అంటే ప్రబంజనం
యువత అంటే మహోజ్వలం
రుద్రుని అంశం.. కాదేది యువతకి అసాధ్యం..

దేశం మనదని ప్రేమిద్దాం.. అసలైన ప్రేమంటే తెలుసుకుందాం..
స్వశక్తినీ నమ్ముకుందాం... పరాయి దేశాల ప్రయాణం మానుకుందాం..
ఇదేలే నిజం.. భారత యువత నైజం..