Pages

Tuesday, October 26, 2010


సరదాగా సాగిన సాయంకాలాలు
అవసరంగా మారిన బాతా ఖానీ
లు
..
శబ్ద వేగంతో సాగే మనోభావాలు..
సదా సంతోషానికి మనం నిలయాలు..

వేళాకోళాలు.. వెక్కిరింపులు
ప్రతి నిమిషం కొత్తగా పలకరింపులు ..
ఒక్క నిమిషం ఎడబాటుకే కన్నీళ్ళు ..
మరు నిమిషం మాటల వర్షాలు ..

అనిర్వచనీయమైన అనుబంధం ..
అమూల్యమైన బంధం
కరిగిపోని స్వప్నం ..
హద్దులేరుగని మన స్నేహం ..

Friday, October 22, 2010


వస్తానన్నావ్..
షోదయపు వేళలో
పసిడి వర్ణాలలో మెరిసిపోయే తీరానికి...
వస్తానన్నావ్..

వస్తానన్నావ్..
సంత కాలంలో కోకిల గానంతో కలిసి
కదలి వస్తానన్నావ్..

వస్తానన్నావ్..
కాలం కరిగిపోయేలోగా..
ఆశే సదలిపోయేలోగా..
హృదయం ఆగిపోయేలోగా..
నా గోడు వినేందుకు ఒక్కసారి వస్తానన్నావ్..
నీ ఒడిలో చోటిస్తానన్నావ్..

వెతికి వెతికి అలసిపోవడమే తప్ప
వెతికేది దొరికే సూచన లేదు
దేని గురుంచి వెతుకుతున్నానో
స్పష్టత లేదు
ఎలా సాధించుకోవాలో
మార్గం తెలిదు..
ఎందుకు ఈ అన్వేషనో
జావాబు లేదు
కానీ అన్వేషణ సాగుతూనే ఉంది..
ఏదో ఒకనాడు అలసి సొలసి
నా నయనాలు చెమ్మగిల్లి,,,
నా తనువు సొమ్మసిల్లి
ఓపిక నశించిన నా దగ్గరకి
నేను పొందాలి అనుకున్న ఆ ఏదో ఒకటి
నా చెంతకు చేరిన కూడా..
ఆస్వాదించేందుకు.. ఆనందించేందుకు..
నా హృదయంలో స్పందన ఉంటుందా..
ప్రాణం అప్పటివరకు నిలిచి ఉంటుందా..

తడి ఎరుగని నయనాలు చెమ్మగిల్లిన వేళ..
చెంప నిమిరే తోడునిచ్చావు..
కష్టమేరుగని హృదయం క్రుంగిపోయే వేళ..
కలత తీర్చే హితులను ఇచ్చావు..

ఎన్ని ఉన్న ఏదో వెలితి..
అందరున్న ఇంకా ఏదో ఒంటరి స్థితి
జవాబు దొరకని ప్రశ్నార్థక స్థితి ..
నా మనఃస్థితి ..
తరంగానికి కాలం నిమిషాలే
బుడగకి ప్రాణం క్షనికలే ..
పూచే పువ్వుకి అందం ఒక రోజే..

కాలం ఒక వింత స్వభావి
కలుపుకు పోవాలనుకుంటే అణచివేస్తుంది..
ఎదురు తిరిగితే దాసోహం అంటుంది..

స్థిమితం లేని కాలంతో
గనిస్తావ వెల కట్టలేని జీవితాన్ని ??

కలల వచ్చి ..
కలకలం సృష్టించి..
కాలంలో కలిసే కలతలకి
తల వంచి ..
తొలి బిందువులాంటి జీవితాన్ని
వ్యర్ధం చేసుకుంటావా ??

విజయం ఒక వరం
విఫలం ఒక ప్రయోగం
కష్టం ఒక పాఠం
ధైర్యమే నీ ఆయుధం

అడుగేసే ప్రతి చోట
ఎదురవాన్ని ముళ్ళు
సాహసంతో మార్చుకో
అది పూలా బాటగా

Tuesday, April 27, 2010

ఏడ్చిన కన్నులు తాడి ఆరాక మునుపే రా..
బరువెక్కిన హృదయం పగలక ముందే రా..
బ్రతకాలన్న కోరిక నశించగా
ఆహ్వానిస్తున్న.. నా ఆహ్వానాన్ని మన్నించి రా..

చితికై వెతికే చీకటి దారుల్లో ఎదురై రా
ఒంటరినై నేనుండగా తోడువై నువ్వు రా
అన్వేషించే నా మదికి సమాధానమై రా
సాగించే నా పయనానికి తుది గమ్యం తెలిపేందుకు రా
శ్వాసించే ఊపిరి నిలిచిపోగా రా..
శాశ్వత మనఃశాంతిని ప్రసందించగా రా..

Saturday, March 27, 2010

వింటారా చెప్తున్నా
విధుషకున్ని నేను..
వింత జీవిని కాను..
మీలో ఒకన్ని నేను..
నవ్వించడమే పనిగా ఉన్నాను..

ఆశలు, నిరాశలు,
కోపాలు, ఏడుపులు,
ఒత్తిడిలు అన్ని మరపించి
మనసారా నవ్వించే
విధుషకున్ని నేను
వింటారా చెప్తున్నా..
నా కథని నేను..

ఎన్నో వేషాలు ధరించాను
వెక్కిరింతలెన్నో భరించాను
రెప్పల మాటున కన్నీటిని
ధారగా పోసి నవ్వుల పువ్వులు పూయించాను
ఊహ జనితం నా నవ్వు
నా ఊహను చూసి నువ్వు నవ్వు

వింతైన అవతారం
వరముగా మారిన శాపం
నా అదృష్టం..
నా బాధ కూడా ఒకరికి ఆనందం
నా ఆవేదన సైతం ఒకరికి ఆహ్లాదం
ఎన్ని బాధలు లోతున అనుచుకున్న
అందరిని నవ్వించేవాడిగా ఉంటున్న
అందరిలో ఒక్కడిగా ఉంటున్న
నేనెప్పుడు ఒంటరినే అంటున్న..
విధుషకున్ని నేను..
వేదాంతిని కాను..
నా కథని చెప్పుకున్నాను..

నీ ప్రేమ తామరాకుపై నీటి బొట్టే అని తెలిసిన..
మన స్నేహానికి ఆయువు కొన్నాళ్ళే అని ఎరిగిన..
నీ పై నా ప్రేమ
నీకై నా ధ్యానం
వెంటాడే నీ మౌనం..
మరువ తరమ.. నా మనసు వశమా??

వసంతపు పరిమళాలు కాలమంత ఉండవని
కోకిల గానం ఆపుతుందా??
మేల్కొంటే కరిగిపోతుందని అని
కనులు కలలను బహిష్కరిస్తయా??
నీతో నాకు మిగిలనవి కొన్ని క్షణాలే ఐన
నీ మనసు దాటి నువ్వు పలికిన పలుకులు
యుగాలు మారిన
నేను ఈ జగాన్ని వీడిన
మరపు ఆసాధ్యం
క్షనలున్నాయి అని నీతో మాట కలిపిన
ప్రతి క్షణం మన ఇద్దరిని మరింత దగ్గర చేస్తుంది......

Sunday, January 31, 2010


నీ ప్రేరణ నాకు ఉత్తేజం
నీ
స్వప్నం నాకు చూపెను మార్గం
నీ
కృషి నా జీవితానికి పరిచెను రాచబాట
నీ
ప్రోత్సాహం నన్ను నివ్వేరపరచింది

నువ్విచ్చిన
స్వేచ్చ నాలో జీవం నింపింది
నీకోసం
నువ్వు ఏనాడు ఆలోచించలేదు
నా
అనే స్వార్థంతో ఏనాడు జీవించలేదు
నీ
జీవితమే నాకు ఆదర్శం