Pages

Saturday, December 19, 2009


ఉనికిని కోల్పోయిన వేళ
నరకానికి
నా పయనం
అనుబంధాలు
అసత్యాలు అయిన వేళ
నరకానికి
నా పయనం

అంతు
లేని దుఃఖం అలముకున్న వేళ
ఆత్మీయత
అస్తిత్వం కోల్పోయిన వేళ
సాగించాను
నరకానికి నా పయనం..

అనంతమైన దుఖం మహోగ్రమైన వైతరనిగా ప్రవహించగా
అలమకున్న
చీకటిలో, యమ లోకపు వాకిటిలో..
విషమించిన
పరిస్థితులే కింకరులై లాక్కుపోగా
మతి
లేక.. మాట రాక.. ఎదిరించే శక్తి చాలక..
మౌనంగా
సాగించా నరకానికి నా పయనం..

పెంచుకున్న ప్రేమ.. పంచుకున్న స్నేహం..
అల్లుకున్న
అనుబంధం.. పాపంగా మారి..
నా
పాలిట శాపంగా చేరి..
పాశాన్ని
వేసి ప్రాణాలను హరించగా..
రోదిస్తూ
సాగించా.. నరకానికి నా పయనం..

Monday, December 14, 2009


లేదు లేదు జగాన

లేదు లేదు జగాన

లేదు నిజం ఏ మూలన

ఎంతకెంత వెతికినా

అంతకంత వేదన

అంతమాత్రాన ఆగునా

అలుపెరుగని నా శోధన

తెలుగువాడి మస్తిష్కాన

తెలుగు "వాడి" రోదన

ఆంగ్లంలో భోధన

తెలుగు పై మక్కువ పడెను వెనుకన

విరామమెరుగని అన్వేషణ

సమాధాన పడకుండా ఆగునా?

శాశ్వత సత్యముకై నా అంతరాత్మ చింతన

దాని జడ తెలియనిదే లేదు నాకు నిర్యాణ.......

--------------- Srinivas