Pages

Thursday, October 27, 2011

లోకానికి ఒకటి చూపి
మాలోన మరొకటి దాచే
ముసుగులు మావి ఓహ్ శంకర!!

నీలోన విషాన్ని దాచి..
లోకానికి అమృతమిచ్చిన
వైణం నీదిరా భోళ శంకర!!

లౌక్యం తెలియనివాడ..
లింగాకరా.. అమాయకేశ్వరా..
శంకర.. హర హర..
రారా శంకర
దిగి రారా ఈశ్వర
దిక్కులన్ని ఒక్కటి చేయగా
దీనుల మొరలాలకించగా
ధ్యానం భగ్నం కావించి
ఇల చేరరా పరమేశ్వర..

మనుషులను ఒదిలి
మరలతో సావాసం చేసి
మమకారానికి ముసుగులు తొడిగి..
జీవిస్తున్నాం అనే బ్రాంతిలోనే బ్రతికేస్తున్నాం..
లోకంలో ఉంటూ ఒకరితో ఒకరికి
ఎవరికీ ఎవరో తెలియని మాకన్నా
కాష్టంలో ఉన్నా.. లోకమంతా నడిపించే
నువ్వేలే మిన్న..

కళ్ళు మూసి ధ్యానించే దేవర
కన్నులు మూయించే లయ కార
మా కన్నులు తెరిపించవయ్య ఓంకార

సిరిగలవాడు ఒకడు 
సిరి కాదు భస్మలేపనుడు
గంగానేత్తినవాడు
అగ్నినేత్రము తోడు..
భాషనిచ్చినవాడు.. 
మౌన యోగి వాడు..
సర్వాంతర్యామి వాడు..
సగమే మిగిలాడు.. 

జడము వాడు.. ఒక చోట నిలవలేడు..
జడలవాడు.. వీరభద్రుడు వాడు..
భూతాలనాధుడు.. భూతల  నాయకుడు..
కాలరూపుడు.. కాలాతీతుడు..
సకలం తెలిసినవాడు.. సర్పభూషణుడు..
విషము మ్రింగినవాడు.. వెండి కొండనేక్కినాడు

అపద్బందవుడు.. అఘోర రూపుడు 
నిటలాక్షుడు.. మహా దేవుడు.. నీలకంటుడు ..
హరుడు.. భవుడు.. మహా శివుడు..
శంకరుడు....

Friday, October 7, 2011

చీకటి పొరల మాటున దాగిన
వెలుగు పుంజాన్ని కాంక్షించాను

అలుపే ఎరుగక..
పయనం ఆపక..
నది నదాలు.. కడలులు దాటగా
చేతికి దొరికిన ఫలితం శూన్యం..

ఇరుకు దారుల నడిచా..
పట్టణాలు.. కోటలు.. దాటా..
మేధావులను కలిశా..
మహాత్ములనెరిగా..
ఎంత దూరం వెళ్ళినా
ఎండమావులే అడుగడుగునా..

అనంత విశ్వం తిరిగినా
ఆనందపు చిరునామా తెలిసేనా??
అలసి సొలసి.. 
సేద తీరగా.. రెప్ప వాల్చగా..
తెలిసెను సత్యం.. గాంచెను మార్గం..
అఖండ ఙానం శోధించగా.. సాదించగా..
అంతర్ముఖం కావలి.. అంతర్మధనం సాగాలి..




Sunday, October 2, 2011

అలసిన నయనాలతో 
కునుకు తీసే వేళ
అపసవ్య రాగాలతో 
వీచెను పవనాలు...
విన వచ్చే నిట్టూర్పులు..
తోచెను బయనక స్వప్నలు..

అదిరెను నయనం..
బెదిరెను ప్రాణం..
పరుగులు పెట్టెను
పాదం కిందన పుడమి..

ఆవేదనో.. ఆవేశమో..
ఏమో ఇది అంతుచిక్కని ఏకాంతమో..
దుఖమో.. భయమో..
ఏమో ఇది అవ్యక్తమైన 
ఒంటరితనమో..