Pages

Monday, December 2, 2013

 అంతరంగంలో కదిలే ఆలోచనలకు 
అక్షర  రూపం ఇవ్వాలని..  
ప్రతి భావాన్ని.. 
మాటలతో అలంకరించాలని.. 
కలలో రూపాలకు కళతో  
ప్రాణం పోయాలని
ఆశించే మది నేడు 
నిత్య జీవన ఘర్షణలో 
సంఘర్షణలతో మౌనం వహించింది 
పొంగే ఆ పదాల సెలయేరు ఇంకిపోయింద??
కదిలే కుంచె స్థానువయ్యిందా??
బయపెట్టే ప్రశ్నలు చుట్టూ ముట్టి
ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తుంటే
ఉపిరి సలపని పనులు
మా సంగతేంటని ప్రశ్నిస్తున్నాయి??
మనసుతో నేను 
----------------
మనసనే పదార్ధం 
లేక ముందు నేనోక
ఉనికి లేని ప్రశ్నర్దాకాన్ని..

మనసుతో పరిచయం
ఏర్పడిన తర్వాత
నాకు నేను ఒక కొత్త వ్యక్తిత్వాన్ని..

మనసుతో రమించడం
మొదలయ్యాక
నేనోక భావకుడిని..

మనసు అధీనంలోకి
నేను లోంగిపోయిన క్షణాన
నేను ఉన్మాదిని..

మనసుతో పోరాడే
సమయంలో నేను
గెలుపోటముల మధ్య
నిస్సహాయ సైనికుడిని..

మనసు పరిధిని మించి
ఎదిగి.. మౌన సహచర్యంలో
నిలకడ పోందినప్పుడు
నేను పూర్ణ ఙానిని..
దేవుడికి మాటలొస్తే...

హరి అయితేనేమి.. హరుడైతేనేమి..

పేరు ఏదైతేనేమి..
మీ సిరి కోసం
ఆలయమనే గిరి గీసి కూర్చోపెట్టారు

అహం బ్రహ్మాస్మి అని నేనంటే
అహం మీరు తీసుకుని
బ్రహ్మాన్ని బ్రహ్మాండంలో లీనం చేసారు

కోట్లు పెట్టి కోవెల్లు కట్టిన
పసిడితో ప్రాకారలు  నిర్మించిన
దీపం తో పాపం పోదు 
పోయేది చీకటి తప్ప..

ఆభిషేకాలు.. అదాంగా పూజలు
వ్రతాలు, నోములు.. పురాణ కాలక్షేపాలు
ఎన్ని చేసినా
నైవేద్యం తో నిర్వాణం  దక్కదు
ఆకలి తీరుతుందే కాని..

విష్ణు, లలిత సహశ్ర పారాయణలెన్ని చెసినా
భగవధ్, సాయి, శివ గీతలు లక్షలు అయినా
పారాయణ తో పుణ్యం రాదు
చిత్త శాంతి తప్ప..

మనసులో లేని నిష్ఠ
మాలలో ఉంటేనేమి.. లేకుంటేనేమి..??