
నీ ప్రేరణ నాకు ఉత్తేజం
నీ స్వప్నం నాకు చూపెను మార్గం
నీ కృషి నా జీవితానికి పరిచెను రాచబాట
నీ ప్రోత్సాహం నన్ను నివ్వేరపరచింది
నువ్విచ్చిన స్వేచ్చ నాలో జీవం నింపింది
నీకోసం నువ్వు ఏనాడు ఆలోచించలేదు
నా అనే స్వార్థంతో ఏనాడు జీవించలేదు
నీ జీవితమే నాకు ఆదర్శం