Pages

Tuesday, May 26, 2009

The following one is about a Father & Daughter relation

గారాబం చేసిన గాంభీర్యం చూపినా,

గారాల తల్లి అలిగిన వేళ

గాడాంధకారం అలముకోదా?

పుణ్యల తల్లి, మా కల్పవల్లి,

కోరిన కోర్కెను తీర్చకపొతే

బుంగమూతి అందం చూడనివడిదా బాగ్యం?

హాయిని కొల్పే ఆ దరహాసం

క్రిష్ణ పక్షమెరుగని జాబిలి కదా?

చిట్టి తల్లి చెతులు నా చిటికెన వెలు పట్టి

పుతడి పాదాలు బుడి బుడి అడుగులు వేయగ

కందిపొవున? కమిలిపొవున? అనే దిగులు,

చేతులలొ ఒదిగిపొయె పసిపిల్ల

భూజాలకెదిగిన వేళ,

విదిచి వెళ్ళిపోతుందేమొ అనే భయం.

గుండెల పై సేదతీరె పుత్తడి బొమ్మ

వేరే గుటికి చేరిన వేళ....

కన్నిటికి అడ్డుందా?

గుండెకోతకి హాద్దుందా?

ఈ సత్యం మారదని తెలిసిన, ఆవేదనకు అంతుందా?

 


                                                                           --------- Srinivas

No comments:

Post a Comment