
నీ ప్రేమ తామరాకుపై నీటి బొట్టే అని తెలిసిన..
మన స్నేహానికి ఆయువు కొన్నాళ్ళే అని ఎరిగిన..
నీ పై నా ప్రేమ
నీకై నా ధ్యానం
వెంటాడే నీ మౌనం..
మరువ తరమ.. నా మనసు వశమా??
వసంతపు పరిమళాలు కాలమంత ఉండవని
కోకిల గానం ఆపుతుందా??
మేల్కొంటే కరిగిపోతుందని అని
కనులు కలలను బహిష్కరిస్తయా??
నీతో నాకు మిగిలనవి కొన్ని క్షణాలే ఐన
నీ మనసు దాటి నువ్వు పలికిన పలుకులు
యుగాలు మారిన
నేను ఈ జగాన్ని వీడిన
మరపు ఆసాధ్యం
క్షనలున్నాయి అని నీతో మాట కలిపిన
ప్రతి క్షణం మన ఇద్దరిని మరింత దగ్గర చేస్తుంది......
No comments:
Post a Comment