
విధుషకున్ని నేను..
వింత జీవిని కాను..
మీలో ఒకన్ని నేను..
నవ్వించడమే పనిగా ఉన్నాను..
ఆశలు, నిరాశలు,
కోపాలు, ఏడుపులు,
ఒత్తిడిలు అన్ని మరపించి
మనసారా నవ్వించే
విధుషకున్ని నేను
వింటారా చెప్తున్నా..
నా కథని నేను..
ఎన్నో వేషాలు ధరించాను
వెక్కిరింతలెన్నో భరించాను
రెప్పల మాటున కన్నీటిని
ధారగా పోసి నవ్వుల పువ్వులు పూయించాను
ఊహ జనితం నా నవ్వు
నా ఊహను చూసి నువ్వు నవ్వు
వింతైన అవతారం
వరముగా మారిన శాపం
నా అదృష్టం..
నా బాధ కూడా ఒకరికి ఆనందం
నా ఆవేదన సైతం ఒకరికి ఆహ్లాదం
ఎన్ని బాధలు లోతున అనుచుకున్న
అందరిని నవ్వించేవాడిగా ఉంటున్న
అందరిలో ఒక్కడిగా ఉంటున్న
నేనెప్పుడు ఒంటరినే అంటున్న..
విధుషకున్ని నేను..
వేదాంతిని కాను..
నా కథని చెప్పుకున్నాను..