
నువ్వు నా చెంతకి నడిచోచ్చిన వేళ..
నువ్వు నాతో ఉంటానని మాటిచ్చిన వేళ..
నా దురదృష్టానికి ఇంకా కాలం చెల్లిందని అనుకున్న..
ఆకాశాన్ని తకేటట్టు నాలో నేనే గళం ఎత్తి కేక పెట్ట..
అవధులు లేని ఆనందంతో అలల తరంగంలాగా ఉరకలు వేశా..
అంతలోనే విధికి కన్ను కుట్టిందో..
ఆ శనికి దురద పుట్టిందో..
ఏమిటిరా అని చూస్తే..
నన్ను విడిచి వెళ్ళిపోయింది అనుకున్న దురదృష్టం
నిజానికి నన్ను విడిచి వెళ్ళిపోలేదు..
నాకన్నా వేగంగా అది
నాకన్నా ముందరే అది
నేను చేరుకోవలనుకున్న ఆ ఆనందం చెంతకి చేరింది..
చేరి.. ఆనందాన్ని నేను అశ్వదించలేకుండా చేసింది..
స్వర్గాన్ని సైతం నా కళ్ళకు నరకంలాగా కనపడే విధంగా చేసింది..
No comments:
Post a Comment