Pages

Tuesday, November 24, 2009

కాల రుద్రుడే కేక పెట్టేనా..??
కాల చక్రం గతి తప్పేనా ???

కల్పాంతపు ముహుర్థమో....?
కాలుష్యపు విశ్వరుపమో?
విష జ్వరాలు విష నాగులై..
బుసలు కొట్టగా..
సామాన్యుడి బతుకు కాలి బుగ్గి పాలైంది..
ప్రమాదమే పరమావధిగా
సాంకేతిక సాగుతుండగా..
సామాన్యుని జీవిత చిత్రం చిధ్రమైనది...

మృత్యు దేవత మహాయాగం తలపెట్టేనో?
కలిపురుషుడు అభయమిచ్చి వరమోసగెనో?
అంతు చిక్కని వ్యాదులెన్నో అవతారం దాల్చెను...
మానవాళికి దుఖాన్ని..ప్రకృతికి గుండెకోతని.. మిగిల్చేను..

అవరోధాలు తేచిపెట్టు ప్రయోగాలు కట్టిపెట్టి..
పచ్చదనంతో పర్యావరణ రక్షణకై నడుం కడితే..
కాలరుద్రుడే నీలకంటుడై అభాయమోసగును...
పుడమి తల్లి పులకించి పాడిపంటలు ప్రసాదించును ..

No comments:

Post a Comment