Pages

Saturday, March 5, 2011

modhati katha

smoke తో పాటు భరించలేని దగ్గు.. ఊపిరి ఆడకుండా చేస్తుంది..
అయిన కూడా మానుకోలేని అలవాటు.. అతని life లో అది ఒక part అయిపొయింది..
He can't live and he can't even think with out smoking..
అంతగా అతన్ని ఆ అలవాటు లొంగతీసుకుంది..
కానీ ఈ రోజు మరి ఎక్కువగా దగ్గు.. ఆయాసం.. కదలలేని స్థితి..
కంగారుగా వచ్చి చేయి పట్టుకుని లోపలి తిసుకువేలుతున్నభార్య వైపు చూసాడు..
తనకి heart problem.. అతనికి భార్య అంటే అమితమయిన ప్రేమ..
ఒక్క గంట కనిపించకపోయినా ఏ పని మీద శ్రద్ధ పెట్టలేదు.. ఒక విధంగా ఈ రోజు అతని ఈ స్థితికి భార్య అనారోగ్యం కూడా ఒక కారణమే..
నయం చెయ్యలేని ఒక problem తో తన భార్య బాధ పడుతుందనే వేదన అతన్ని లోలోపల దహించేస్తుంది..
దాన్ని కొంతవరకయినా మర్చిపోవడానికి మళ్ళి అతనికి smoking యే దారిగా కనిపించింది..

కొడుకుని పిలిచి హాస్పిటల్ కి బయలదేరారు..
కొడుకు .... చదువు అంతంత మాత్రం.. ఆశయాలు ఉన్నాయ్.. కానీ ఆశయాలు తగ్గట్టు ఆలోచనలు లేవు.. ఆచరణ లేదు..
అతనికి ఉన్నదీ ఒకే ఒక చిన్న వ్యాపారం.. ఆ వ్యాపారం తన తర్వాత తన కొడుకు చక్కగా చుసుకుగాలాడో లేదో అని కూడా ఒక బెంగ..
కూతురుకి ఎంతో మంచి సంబంధం చూసి చేద్దాం అనుకుంటే.. నేను కోరుకున్న అబ్బాయినే చేసుకుంట అంటూ చేసుకున్నవాడు సరయినవాడు కాదు అన్నది మరోక పెద్ద బెంగ ఆ తండ్రికి.. కుతురంటే అతనికి బహిర్ప్రాణం. ఇన్ని బెంగాలను మర్చిపోవడానికి అతనికి గల ఒకే ఒక మందు.. smoking..

కానీ అదే అతని పాలిత విషం అన్నది కూడా అతనికి తెలుసు.. కానీ ఏమి చెయ్యలేని స్థితి..
హాస్పిటల్ లో డాక్టర్ x-ray చూపిస్తూ.. ఊపిరి తిత్తులు మొత్తంగా చెడిపోయాయి.. మీరు పూర్తిగా స్మోకింగ్ మానేస్తేనే తేరుకుంటారు.. కొన్ని రోజులు పూర్తి విశ్రాంతి అవసరం అని అన్నారు.. ఆయాసం తగ్గడానికి gas పెట్టారు..

అతని mind లో మాత్రం ఒకటే tension. సాయంత్రం 6 అయేసరికి ఈ హాస్పిటల్ నుంచి బయటపడిపోవాలి.. తను తన వ్యాపారానికి వెళ్ళాలి..
అనుకున్నట్టే సాయంత్రానికి హాస్పిటల్ నుంచి బయటకి వచేసారు.. కానీ వ్యాపారానికి వెళ్ళేంత శక్తీ లేదు.. mind కూడా అచేతన స్థితి లో ఉంది..
urgent గా smoke చెయ్యాలని ఉంది.. కానీ డాక్టర్ మాటలు గుర్తొచ్చి మళ్ళి ఆ ఆలోచన మానుకున్నారు..
కానీ mind అస్సలు పని చెయ్యడం లేదు.. కొడుకుని తీసుకుని bike మీద ఆ అచేతన స్థితిలోనే హాస్పిటల్ నుంచి అటునుంచి అటే వ్యాపారిని బయలుదేరారు..
దారిలో bike దిగి మళ్ళి ఎక్కుతుండగా, నాన్న ఎక్కేసరేమో అనుకుని bike తిసేయబోయ్యాడు కొడుకు..
దానితో serious అయిన తండ్రి.. ఇంటికి రాగానే నీ కొడుకు ఈ రోజు నన్ను చంపేయాలి అని చూసాడు అని అన్నారు.. కొడుకు చాల బాధ పడ్డాడు.. కానీ అది అతను కావాలని అనలేదు.. ఏదో అచేతన స్థితిలో ఉండడం వాళ్ళ అల అన్నారు అన్నది ఆ కొడుకుకి తెలుసు.. ఎందుకంటే ఆ కొడుకు అంటే ఆ తండ్రికి ఎంత అభిమానమో.. ఎంత ప్రేమో.. తనకి తెలుసు..

మరుసటి రోజు అంత normal అయింది.. కొన్ని రోజులు అంత happy గానే ఉంది.. కానీ ఒకరోజు తీవ్రమైన జ్వరం.. ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారు
వెంటనే లేవదీసి లోపలి తిసుకోచి పడుకోపెట్టారు.. కాసేపటికి లేచి కూర్చున్నారు.. సాయంత్రం హాస్పిటల్ కి వెళ్లారు.. డాక్టర్ చూసి.. chicken guniya అని చెప్పారు..
injection ఇచ్చి పంపించారు.. ఏ బయం లేదు.. ఉదయానికి ఇంకా నయం కాకపోతే తీసుకురండి అన్నారు.. ఇంటికి వెళ్ళిన కూడా ఏ మాత్రం తగ్గలేదు.. వంతులు.. నిద్ర లేమి.. తట్టుకోవడానికి smoking.. ఆ రాత్రి తెల్లవారుజాము వరకు ఆ ఇంట్లో ఎవరికీ నిద్ర లేదు.. ఏ తెల్లవారుజాము 4 కో పడుకున్నారు.. తర్వాత 6 కి లేచిన భార్య.. నిద్రలో ఉన్న అతనిని చూసి.. బాగా నిద్ర పట్టినట్టు ఉంది అనుకుని తన దినచర్య లో మునిగిపోయింది.. తర్వాత లేచిన కొడుకు పేపర్ చదువుతూ అందులో ఉన్న వార్త చూసి తన తండ్రి దగ్గరకి వచ్చాడు.. వచ్చి చుసిన కొడుకు నిర్గాంత పోయాడు.. తన తండ్రి స్థితి లో ఏదో మార్పు.. పిలిస్తే పలికే దురం లో తన తండ్రి లేరని ఆ కొడుకు తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు.. అది విన్న ఆ భార్య గుండెలు బాదుకుంటూ ఏడ్చినా ఏడుపు కూడా వినే అంత దురం లో లేరు అతను.. ఈ లోకాన్ని.. ఈ లోకం లో తనని నిరంతరం వెంటాడిన ఆలోచనలని.. అన్నిటిని విడిచి చిదానంద స్వరూపం లో ఎకమయిపోయారు.. ఆ కొడుకు ఆ news paper లో చూసింది.. ఆ మరుసటి రోజు father's day అనే విషయం.. తన తండ్రికి wish చేద్దాం అని వచ్చిన కొడుకుకి ఇంకా ఎవరికీ విష్ చెయ్యాలో తెలియని స్థితి మిగిలింది..

2 comments:

  1. seenu :(

    yu made me cry

    am very sorry ra

    so sorry

    nijam ga devudunte, aalochanalke shakthi unnadi nijamaithe, nee gamyanni chere daari neeku thappakunda dorukuthundi.
    Chala tvaralone..

    miss yu

    ReplyDelete
  2. ummm.. thank u akka..

    Miss u too

    ReplyDelete