నీ ఉనికికి.. నీ ప్రగతికి..
నీ జగతికి.. ఈ ధాత్రికి..
మూలాధారం నేను..
ప్రతి జీవికి.. తన మనుగడకి..
సాక్షి భూతం నేను..
నాకు లేవు ఏ అసమానతలు..
నియంత్రిస్తా హెచ్చు తగ్గులు..
ఒక్కడివే.. నువ్వొక్కడివే..
నీ స్వార్థం కోసం.
నా సృష్టిని అతలాకుతలం చేస్తూ ఉంటె..
చూస్తూ నేనెలా ఊరికే ఉంటా..
నువ్వనుకునే నీ అభివృద్ధి..
నీ పాలిట బస్మాసుర హస్తం..
నీ తోటి జీవ జాలానికి మృత్యు పాశం..
నా కోపం
మహోగ్ర రూపం..
నా ఆగ్రహం..మహా ప్రళయం..
నువ్వు విషం కక్కితే..
నేను విలయ తాండవం చేస్తా..
నువ్వు పచ్చదనం పెంచితే..
నేను చిరు నవ్వు చిందిస్తా...
No comments:
Post a Comment